Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 6:19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప వస్తువులు అన్నీ యెహోవాకు పవిత్రమైనవి, వాటిని ఆయన ఖజానాలోనికి చేర్చాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప వస్తువులు అన్నీ యెహోవాకు పవిత్రమైనవి, వాటిని ఆయన ఖజానాలోనికి చేర్చాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 6:19
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.


యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజానాలోని పదార్థములను, ఎత్తికొని పోయెను, అతడు సమస్తమును ఎత్తికొని పోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొని పోయెను.


మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలురాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.


ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొని పచ్చిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.


కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.


యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయు వారైరి.


దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలో మీతుచేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.


వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.


తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునందుంచెను.


వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవభాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింప బడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.


లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడు వారితోకూడ ఉండ వలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,


ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి, అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొనిపోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపి–పాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.


నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును;


సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతి ష్ఠించుదును.


వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.


తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా


మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును


ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసి కొని – ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.


ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి.


ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొనియున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ