Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 21:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 లేవీయుల వంశపు పెద్దలు యాజకుడు ఎలియాజరు దగ్గరికీ నూను కుమారుడు యెహోషువ దగ్గరికీ ఇశ్రాయేలీయుల గోత్రాల, కుటుంబాల పెద్దల దగ్గరికీ వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 లేవీ వంశంపు ప్రధానులు యాజకుడైన ఎలియాజరుతో, నూను కుమారుడు యెహోషువతో, ఇశ్రాయేలీయుల ఇతర వంశాల ప్రధానులతో మాట్లాడేందుకు వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 21:1
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.


వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.


అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమతమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు.


మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను


మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములోనుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను.


ఇశ్రాయేలీయులు కనానుదేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి.


వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధానుల యెదుటికిని వచ్చి–మా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవిచేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రియొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.


యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్లవలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచి పెట్టుట ముగించిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ