Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోవేలు 1:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీపితరుల దినములలోగాని జరిగినదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి. మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 నాయకులారా, ఈ సందేశం వినండి! దేశంలో నివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి. మీ జీవితకాలంలో ఇలాంటిది ఏదైనా ఇదివరకు జరిగిందా? లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఏదైనా జరిగిందా? లేదు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 పెద్దలారా, దీనిని వినండి; దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి. ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని, మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 పెద్దలారా, దీనిని వినండి; దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి. ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని, మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోవేలు 1:2
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు


నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.


భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?


మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.


సర్వజనులారా ఆలకించుడి.


రాష్టములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.


యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమదినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటివరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.


అయ్యో, యెంత భయంకరమైన దినము ! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.


–కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.


ఆ కాలమందు నీ జనులపక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలమువరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.


ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.


యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలువారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును.


ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.


ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.


ఐగుప్తుదేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.


షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా –మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా


ఇశ్రాయేలువారలారా, మిమ్మునుగూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి.


సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలో నున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్ధాలయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.


నేనీలాగు ప్రకటించితిని–యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.


యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.


చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.


లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.


చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ