Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 9:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే. ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి! మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు! ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే. ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 “ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు, స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 “ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు, స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 9:4
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ఆయన–నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను.


తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను


అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలి కానికి కీడుచేయడు తన పొరుగువానిమీద నింద మోపడు


అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.


తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.


అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.


కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు


యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు


లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.


తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి.


ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మ్రింగివేయబడు దురు.


నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు.


వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.


వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.


కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామవికార చేష్టలు జరుగుచున్నవి.


నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.


మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహముచేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?


మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు,


సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.


తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;


ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ