Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 9:26 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 9:26
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చిన మాట వినుడి.


అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలనుబట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.


మోయాబులోనేమి అమ్మోనీయులమధ్యనేమి ఎదోములోనేమి యే యే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబులోనురాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు


వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండునువారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు,


విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.


కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.


సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము.


ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి.


కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.


నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,


ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.


మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును.


యోనాతాను – ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా


దావీదు–జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ