యిర్మీయా 8:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనముచేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 దాను వంశీయుల రాజ్యంనుండి శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి. వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది. వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ నాశనం చేయాలని వచ్చియున్నారు. వారీ నగరాన్ని, నగరవాసులను సర్వనాశనం చేయటానికి వచ్చారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |