Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 6:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకచేయుచున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములును దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది. దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది. అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. ఈ నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను. యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 బావి తన నీళ్లను ఎలా బయటకు ఉబికేలా చేస్తుందో, అలాగే ఆమె తన దుష్టత్వాన్ని కుమ్మరిస్తుంది. హింస, విధ్వంసం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది; ఆమె జబ్బులు, గాయాలు నిత్యం నా ముందు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 బావి తన నీళ్లను ఎలా బయటకు ఉబికేలా చేస్తుందో, అలాగే ఆమె తన దుష్టత్వాన్ని కుమ్మరిస్తుంది. హింస, విధ్వంసం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది; ఆమె జబ్బులు, గాయాలు నిత్యం నా ముందు ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 6:7
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము


అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.


భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.


వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదువారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో గింపదు వారి క్రియలు పాపక్రియలేవారు బలాత్కారము చేయువారే.


ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను.


యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది;


నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగినమందు నీకు లేదు.


నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.


నాకోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదావారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి, నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను.


గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?


శకునగాండ్రు నీకొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోషసమాప్తి కాలమున శిక్షనొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడ వేయును.


దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.


మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.


వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు.


దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండి యున్నది. సంకెళ్లు సిద్ధపరచుము.


ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ