17 కల్దీయుల సైన్యం ఆలయంలోని కంచు స్తంభాలను విరుగగొట్టింది. యెహోవాయొక్క ఆలయంలో గల స్తంభాలను, కంచు సముద్రమును (కోనేరు) కూడ ముక్కలు చేశారు. ఆ కంచునంతా వారు బబులోనుకు తీసికొని పోయారు.
దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది
ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.