యిర్మీయా 50:42 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరువారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నదివారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 వాళ్ళు వింటినీ, బల్లేలనూ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు క్రూరులు. వాళ్ళలో కనికరం లేదు. వాళ్ళ స్వరం సముద్రపు ఘోషలా ఉంది. బబులోను కుమారీ, వాళ్ళు యుద్ధ వీరుల్లా బారులు తీరి తమ గుర్రాలపై వస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్42 వారి సైన్యాలకు ధనుస్సులు, ఈటెలు ఉన్నాయి. ఆ సైనికులు బహు క్రూరులు వారికి దయలేదు. గుర్రాలపై స్వారి చేస్తూ సైనికులు వస్తారు. అప్పుడు సముద్ర ఘోషలా శబ్దం పుడుతుంది. వారివారి స్థానాలలో యుద్ధానికి సిద్ధంగా నిలబడతారు! బబులోను నగరమా, నీపై దాడికి వారు సిద్ధంగా వున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు క్రూరులు, కనికరం లేనివారు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు వారి స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది; బబులోను కుమార్తె, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వ్యూహంలోని సైనికుల్లాగా వస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు క్రూరులు, కనికరం లేనివారు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు వారి స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది; బబులోను కుమార్తె, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వ్యూహంలోని సైనికుల్లాగా వస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |