యిర్మీయా 50:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. సింహాలు వాటిని చెదరగొట్టి, తరిమాయి. మొదటిగా అష్షూరు రాజు వాళ్ళను మింగివేశాడు. దాని తర్వాత బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వాళ్ళ ఎముకలు విరగ్గొట్టాడు.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 “పొలాల్లో చెల్లాచెదరైన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది. సింహాలు తరిమిన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది. వానిని తిన్న మొదటి సింహం అష్షూరు రాజు. వాని ఎముకలు నలుగగొట్టిన చివరి సింహం బబులోను రాజైన నెబుకద్నెజరు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు సింహాలు వాటిని తరిమికొట్టాయి. మొదట అష్షూరు రాజు వాటిని మ్రింగివేశాడు; చివరిగా బబులోను రాజైన నెబుకద్నెజరు వాటి ఎముకలను విరగ్గొట్టాడు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు సింహాలు వాటిని తరిమికొట్టాయి. మొదట అష్షూరు రాజు వాటిని మ్రింగివేశాడు; చివరిగా బబులోను రాజైన నెబుకద్నెజరు వాటి ఎముకలను విరగ్గొట్టాడు.” အခန်းကိုကြည့်ပါ။ |
అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.