యిర్మీయా 49:34 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34-35 యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి ఈలాగు సెలవిచ్చెను–సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఏలాముయొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 యూదా రాజు సిద్కియా పరిపాలన ప్రారంభంలో యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఆయన ఏలాము గూర్చి ఇలా చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్34 యూదా రాజైన సిద్కియా పరిపాలనారంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం ఏలాము దేశానికి సంబంధించినది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది: အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది: အခန်းကိုကြည့်ပါ။ |
నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలయి యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.