Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 46:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందువారు తొట్రిల్లిపడుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు. ఉత్తర దిక్కులో వాళ్ళు యూఫ్రటీసు నదీ తీరంలో తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 “వేగంగా పరుగెత్తేవారు, బలవంతులు కూడా తప్పించుకోలేరు. వారు తూలి పడిపోతారు. ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 46:6
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.


బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశమున నున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.


నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి


మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుటవలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.


అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.


అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను–ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.


అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.


సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను,


ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహో వాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరి గింప బోవుచున్నాడు.


నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.


ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు –లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.


గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపెట్టులన్నిటిని కాల్చివేయును.


బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.


అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పు కొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.


ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలనవారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ