Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 44:30 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘సిద్కియా ప్రాణాన్ని తీయాలని వెదికిన అతని శత్రువు నెబుకద్నెజరు చేతికి సిద్కియాను అప్పగించినట్టే ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులకీ, అతని ప్రాణం తీయాలని చూసేవాళ్లకీ అప్పగించబోతున్నాను.’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

30 నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరోహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు. ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 44:30
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని స్వదేశమునకు కాలమువచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.


యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్లిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.


మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.


–నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా


కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ