యిర్మీయా 44:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఐగుప్తులో నివాసముండటానికి వెళ్ళిన మిగిలిన యూదా ప్రజల్లో ఎవరూ కాందిశీకుల్లా తిరిగి యూదా దేశానికి రావాలని ఎంత కోరుకున్నా రాలేరు. అక్కడ నుండి తప్పించుకుని పారిపోయిన ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తిరిగి రారు.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.’” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.” အခန်းကိုကြည့်ပါ။ |
ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితోకూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.