Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 43:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయిం చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 అప్పుడు నిన్ను చూస్తూవున్న యూదా వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: బబులోను రాజైన నెబుకద్నెజరును ఇక్కడికి పిలుస్తాను. అతడు నా సేవకుడు. నేనిక్కడ పాతిపెట్టిన రాళ్లమీద నేనతని సింహాసనాన్ని నెలకొల్పుతాను. నెబుకద్నెజరు తన రత్నకంబళిని ఈ రాళ్లపై పరుస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను నా సేవకుడును బబులోను రాజైన నెబుకద్నెజరును పిలిపించి, నేను ఇక్కడ పాతిపెట్టిన ఈ రాళ్లపై అతని సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాను; అతడు వాటి మీద తన రాజ మండపాన్ని వేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను నా సేవకుడును బబులోను రాజైన నెబుకద్నెజరును పిలిపించి, నేను ఇక్కడ పాతిపెట్టిన ఈ రాళ్లపై అతని సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాను; అతడు వాటి మీద తన రాజ మండపాన్ని వేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 43:10
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

బెన్హదదును ఆ రాజులును గుడారములయందు విందు జరిగించుకొనుచుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా


మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారు లైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులై యుండిరి.


గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను.


ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.


మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచు చున్నావు


కోరెషుతో–నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో–నీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.


అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.


ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు.


–నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులో నున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము


బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతముచేయుటనుగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.


నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములోనుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.


కరవు వచ్చి యుండగా నీలో మూడవభాగము తెగులుచేత మరణమవును, మూడవభాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.


ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.


కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ