యిర్మీయా 41:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితోకూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు, అతనితోపాటు ఉన్న ఆ పదిమంది మనుషులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధికారిగా నియమించిన షాఫాను మనవడూ, అహీకాము కొడుకైన గెదల్యాను ఖడ్గంతో హతం చేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 వారంతా కలిసి భోజనం చేస్తూవుండగా, ఇష్మాయేలు మరియు అతని పదిమంది మనుష్యులు లేచి అహీకాము కుమారుడైన గెదల్యాను కత్తితో పొడిచి చంపారు. గెదల్యా యూదా పాలకుడుగా బబులోను రాజుచే ఎంపిక చేయబడిన వ్యక్తి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న పదిమంది మనుష్యులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధిపతిగా నియమించిన షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గంతో కొట్టి చంపారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న పదిమంది మనుష్యులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధిపతిగా నియమించిన షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గంతో కొట్టి చంపారు. အခန်းကိုကြည့်ပါ။ |
ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకులకధిపతి అతనితో ఈలాగు చెప్పెను–బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీ కాము కుమారుడగు గెదల్యాను యూదాపట్టణములమీద నియమించియున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకులకధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా