యిర్మీయా 40:15 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను–నీయొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించు నట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంప నేల? దయచేసి నన్ను వెళ్లనిమ్ము, ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 కారేహ కొడుకు యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా “నెతన్యా కొడుకు ఇష్మాయేలును నేను చంపుతాను. నన్ను ఎవరూ అనుమానించరు. అతడు నిన్నెందుకు చంపాలి? నీ దగ్గరికి కూడివచ్చిన యూదులందరూ ఎందుకు చెదిరిపోవాలి? మిగిలిన ప్రజలందరూ ఎందుకు నాశనం కావాలి?” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదురై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడుతూ, “నేను వెళ్లి ఎవరికీ తెలియకుండా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపుతాను. అతడు ఎందుకు నీ ప్రాణాన్ని తీయాలి, అలా చేసి, నీ చుట్టూ ఉన్న యూదులందరు చెదిరిపోయేలా, యూదా వారిలో మిగిలినవారు నాశనమయ్యేలా ఎందుకు చేయాలి?” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడుతూ, “నేను వెళ్లి ఎవరికీ తెలియకుండా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపుతాను. అతడు ఎందుకు నీ ప్రాణాన్ని తీయాలి, అలా చేసి, నీ చుట్టూ ఉన్న యూదులందరు చెదిరిపోయేలా, యూదా వారిలో మిగిలినవారు నాశనమయ్యేలా ఎందుకు చేయాలి?” အခန်းကိုကြည့်ပါ။ |