యిర్మీయా 4:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను, အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము. మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఆలస్యం చేయవద్దు! ఇది మీరు త్వరగా చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి నేను విపత్తును తీసుకొని వస్తున్నాను. నేను అతి భయంకరమైన వినాశనాన్ని తీసుకొని వస్తున్నాను.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి! ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి! నేను ఉత్తరం నుండి విపత్తును, భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి! ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి! నేను ఉత్తరం నుండి విపత్తును, భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.” အခန်းကိုကြည့်ပါ။ |
అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.