Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 4:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా–ప్రాకారముగల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. “దేశంలో బూర ఊదండి.” గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. “ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 “ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము: “యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము, ‘దేశమంతా బూర వూది’ బాహాటంగా ఇలా చెప్పుము, ‘మీరంతా కలిసి రండి! రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 “యూదాలో ప్రకటించి, యెరూషలేములో ప్రకటించి ఇలా చెప్పు: ‘దేశమంతటా బూరధ్వని చేయండి!’ బిగ్గరగా కేకలువేస్తూ అనండి: ‘ఒక్క దగ్గరికి రండి! కోటలున్న పట్టణాలకు పారిపోదాం!’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 “యూదాలో ప్రకటించి, యెరూషలేములో ప్రకటించి ఇలా చెప్పు: ‘దేశమంతటా బూరధ్వని చేయండి!’ బిగ్గరగా కేకలువేస్తూ అనండి: ‘ఒక్క దగ్గరికి రండి! కోటలున్న పట్టణాలకు పారిపోదాం!’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 4:5
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.


–మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను


అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనులదండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి.


యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి


బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.


మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనముచేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.


ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను?ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?


వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.


–బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము.


సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక.


పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?


సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?


నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.


ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.


వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును బహుజనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ