Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 39:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 అప్పుడు రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను, పట్టణంలో మిగిలి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి కల్దీయులతో చేరిన వాళ్ళను, ఇంకా మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలి ఉన్నవారిని, ద్రోహులై తమ రాజును విడిచి అతనితో చేరిన వారిని, మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలి ఉన్నవారిని, ద్రోహులై తమ రాజును విడిచి అతనితో చేరిన వారిని, మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 39:9
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.


మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు.


పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోనురాజు పక్షము చేరిన వారిని, సామాన్యజనులలో శేషించినవారిని రాజదేహసంరక్షకుల అధిపతియైన నెబూజరదాను చెరగొని పోయెనుగాని


రాజదేహసంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసికొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా


కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.


యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను.


కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీపితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.


మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.


అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–కల్దీయుల పక్షముగాఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహ సించెదరు.


రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలోనుండి పంపివేయగా, యెహోవా యొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు.


అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.


రాజదేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలోనుండిన బబులోనురాజు నొద్దకు తీసికొని వచ్చెను.


బబులోనురాజు హమాతుదేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశములోనుండి చెరగొనిపోయెను.


అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహసంరక్షకుల యధిపతియగు అర్యోకుదగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను


జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును.


మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ