యిర్మీయా 39:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడలమధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యూదుల రాజైన సిద్కియా, అతని యోధులందరూ వాళ్ళను చూసి పారిపోయారు. వాళ్ళు రాత్రిపూట రాజు తోట మార్గంలో రెండు గోడల మధ్య ఉన్న గుమ్మపు దారిలో నుంచి పట్టణం బయటకు వెళ్ళిపోయారు. రాజు అరాబా మైదానం వైపుగా వెళ్ళాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యూదా రాజైన సిద్కియా, అతని సైనికులందరు వారిని చూసి పారిపోయారు; రాత్రివేళ వారు రాజు తోటలోని మార్గం నుండి రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పట్టణాన్ని విడిచిపెట్టి, అరాబా వైపు బయలుదేరి వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యూదా రాజైన సిద్కియా, అతని సైనికులందరు వారిని చూసి పారిపోయారు; రాత్రివేళ వారు రాజు తోటలోని మార్గం నుండి రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పట్టణాన్ని విడిచిపెట్టి, అరాబా వైపు బయలుదేరి వెళ్లారు. အခန်းကိုကြည့်ပါ။ |