యిర్మీయా 34:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 –నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీపితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నీకు అమ్మకం జరిగాక, నీకు ఆరు సంవత్సరాలు దాస్యం చేసిన హెబ్రీయులైన మీ సహోదరులకు, ఏడు సంవత్సరాలు తీరిన తరువాత, విడుదల ప్రకటించాలి. కాని మీ పితరులు శ్రద్ధ వహించలేదు, నా మాట వినలేదు.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။ |
మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు – ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీపితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి