Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 32:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి–బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసికొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అప్పుడు, యెహోవా ప్రకటించినట్టే, మా బాబాయి కొడుకు హనమేలు చెరసాల ప్రాంగణంలో ఉన్న నా దగ్గరికి వచ్చి, నాతో ఇలా అన్నాడు. “బెన్యామీను దేశంలో అనాతోతులో ఉన్న నా భూమిని నీ కోసం కొనుక్కో. ఎందుకంటే దాని మీద వారసత్వపు హక్కు నీదే.” అప్పుడు ఇది యెహోవా వాక్కు అని నాకు తెలిసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 “తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’” అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 “అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు. “ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 “అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు. “ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 32:8
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనా తోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణమునకు పాత్రుడవైతివిగాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించినశ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.


అందుకు మీకాయా–దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను.


మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లె మెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.


బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు


ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,


యెహోవా ప్రభువా–ధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది.


–నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి – అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.


మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను


యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా


ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని, ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజముమీద పెట్టుకొంటిని


అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని యున్న గొఱ్ఱెలు తెలిసికొనెను.


–నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ