Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 31:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 వాళ్ళు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు తమ విన్నపాలు చెప్తూ ఉండగా నేను వాళ్ళను నడిపిస్తాను. తిన్ననైన రహదారిలో, సెలయేళ్ల దగ్గరికి వాళ్ళను ప్రయాణం చేయిస్తాను. ఆ మార్గంలో వాళ్ళు తొట్రిల్లరు. ఎందుకంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిగా ఉంటాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠసంతానంగా ఉంటాడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు. కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల ప్రక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేనా విధంగా వారికి దారి చుపుతాను. కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 31:9
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను–మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.


వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.


పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.


కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాచేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.


అప్పుడు నీవు ఫరోతో–ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;


వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును


నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును


ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులనుగూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?


–ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.


మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మా తండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.


యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.


నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెద ననుకొనియుంటిని. నీవు–నా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?


అయినను ఇప్పుడు నీవు–నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?


ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.


ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదావారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు


అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;


తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందువారు భయభక్తులుకలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.


దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృిష్టయుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలా పింతురు.


మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహముచేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?


ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.


ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.


దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.


కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, –పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక,


ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.


అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు.


మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మలమధ్య బోడిచేసికొనకూడదు.


బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.


మరియు కుంటికాలు బెణకక బాగుపడునిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసికొనుడి.


పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,


శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.


ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ