Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 31:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను– శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ‘ఇశ్రాయేలూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. కాబట్టి, నిబంధనా నమ్మకత్వంతో నేను నిన్ను ఆకర్షించుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 యెహోవా తన ప్రజలకు దూరము నుండి దర్శనమిస్తాడు. ఆయన ఇలా అన్నాడు: “ప్రజలారా మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూవచ్చాను. నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 31:3
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగిం చుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.


ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద


యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.


నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు.


నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను.


యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొంద కయు నుందురు.


అయితే సీయోను–యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.


ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని.


ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని; ఒకడు పశువులమీది కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని


యెహోవా సెలవిచ్చునదేమనగా –నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు–ఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు.


మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.


ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.


అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను.


యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.


ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురువారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు.


ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను.


మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.


ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.


మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.


ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ