యిర్మీయా 30:18 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు– యాకోబు నివాసస్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 యెహోవా ఇలా అంటున్నాడు “చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు. కాని వారు తిరిగివస్తారు. యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను. నగరమంతా కూలిపోయిన భవనాలతో కప్పబడిన కొండలా ఉంది. కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది. రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။ |
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపెట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.