యిర్మీయా 29:32 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 –నెహెలామీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండువాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేనుచేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 నెహెలామీయుడైన షెమయా యెహోవాకు వ్యతిరేకంగా అబద్ధం ప్రకటించాడు కాబట్టి అతన్నీ, అతని సంతానాన్నీ నేను శిక్షించబోతున్నాను. ఈ ప్రజల్లో కాపురం ఉండేవాడు ఒక్కడూ అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు.’ ఇది యెహోవా వాక్కు.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్32 షెమయా అలా చేసిన కారణంగా యెహోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో నెహెలామీయుడైన షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.’” ఇదే యెహోవా వాక్కు “‘ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా షెమయా బోధించాడు గనుక నేను షెమయాను శిక్షిస్తాను.’” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 యెహోవా ఇలా అంటున్నారు: నెహెలామీయుడైన షెమయాను, అతని సంతానాన్ని నేను తప్పకుండా శిక్షిస్తాను. నా ప్రజలకు నేను చేయబోయే మేలు అతని సంతతిలో ఎవరూ చూడరు, ఎందుకంటే అతడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటించాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 యెహోవా ఇలా అంటున్నారు: నెహెలామీయుడైన షెమయాను, అతని సంతానాన్ని నేను తప్పకుండా శిక్షిస్తాను. నా ప్రజలకు నేను చేయబోయే మేలు అతని సంతతిలో ఎవరూ చూడరు, ఎందుకంటే అతడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటించాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.” အခန်းကိုကြည့်ပါ။ |
నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.