యిర్మీయా 21:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఈ పట్టణంలో ఉండబోయే వాళ్ళు కత్తితో, కరువుతో, అంటురోగంతో చస్తారు. పట్టణం బయటకు వెళ్లి మిమ్మల్ని ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయులకు లోబడేవాళ్ళు బతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగిపోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఈ పట్టణంలో ఉండబోయే వారు ఖడ్గం వల్ల గాని కరువు వల్ల గాని తెగులు వల్ల గాని చస్తారు. అయితే ఎవరైనా పట్టణం బయటకు వెళ్లి మీమీద దాడి చేస్తున్న బబులోనీయులకు లొంగిపోతే, వారు బ్రతుకుతారు; వారు తమ ప్రాణాలతో తప్పించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఈ పట్టణంలో ఉండబోయే వారు ఖడ్గం వల్ల గాని కరువు వల్ల గాని తెగులు వల్ల గాని చస్తారు. అయితే ఎవరైనా పట్టణం బయటకు వెళ్లి మీమీద దాడి చేస్తున్న బబులోనీయులకు లొంగిపోతే, వారు బ్రతుకుతారు; వారు తమ ప్రాణాలతో తప్పించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |
అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.
మత్తాను కుమారుడైన షెఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా–ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనముచేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.