యిర్మీయా 2:35 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 అయినను నీవు–నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నామీదనుండి తొలగిపోయెనని చెప్పు కొనుచున్నావు. ఇదిగో–పాపము చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 ఇంతా చేసినా నువ్వు “నేను నిర్దోషిని, యెహోవా కోపం నా మీదికి రాదులే” అని చెప్పుకుంటున్నావు. ఇదిగో చూడు, “నేను పాపం చేయలేదు” అని నువ్వు చెప్పిన దాన్నిబట్టి నిన్ను శిక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’ అని నీవు చెప్పుకుంటూ ఉంటావు. అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను, ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 నీవు, ‘నేను నిర్దోషిని; ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు. ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు, కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 నీవు, ‘నేను నిర్దోషిని; ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు. ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు, కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |