యిర్మీయా 2:25 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు–ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 నీ పాదాలకు చెప్పులు తొడుక్కుని జాగ్రత్త పడు, నీ గొంతు ఆరిపోకుండా జాగ్రత్తపడు, అని నేను చెప్పాను. కాని “నీ మాట వినను, కొత్తవారిని మోహించాను, వారి వెంట వెళ్తాను” అని చెబుతున్నావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి. ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు. కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను! నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను. నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 నీ పాదాల చెప్పులు అరిగిపోయే వరకు, నీ గొంతు ఆరిపోయే వరకు నీవు పరదేశి దేవుళ్ళ వెంట పరుగెత్తకు. అయితే మీరు ఇలా అన్నారు, ‘మాకు నీవు చెప్పి ప్రయోజనం లేదు! మేము పరదేశి దేవుళ్ళను ప్రేమిస్తున్నాము, మేము వారి వెంట వెళ్లాలి.’ အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 నీ పాదాల చెప్పులు అరిగిపోయే వరకు, నీ గొంతు ఆరిపోయే వరకు నీవు పరదేశి దేవుళ్ళ వెంట పరుగెత్తకు. అయితే మీరు ఇలా అన్నారు, ‘మాకు నీవు చెప్పి ప్రయోజనం లేదు! మేము పరదేశి దేవుళ్ళను ప్రేమిస్తున్నాము, మేము వారి వెంట వెళ్లాలి.’ အခန်းကိုကြည့်ပါ။ |
మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.