Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 15:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 వారి విధవరాండ్రు సముద్రపు ఇసుకకంటె విస్తారముగా ఉందురు; మధ్యాహ్నకాలమున యౌవనుల తల్లిమీదికి దోచుకొనువారిని నేను రప్పింతును; పరితాపమును భయములను ఆకస్మాత్తుగా వారిమీదికి రాజేతును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 వారి వితంతువుల సంఖ్య సముద్రతీరాన ఇసుక కంటే ఎక్కువయ్యేలా చేస్తాను. నేను మధ్యాహ్నం సమయంలో యువకుల తల్లుల మీదికి నాశనం చేసేవాణ్ణి పంపిస్తాను. వారి మీదికి భయం, దిగ్భ్రాంతి ఆకస్మాత్తుగా రప్పిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు. సముద్రతీరాన ఉన్న ఇసుకకంటె ఎక్కువగా విధవ స్త్రీలు వుంటారు. మధ్యాహ్న సమయంలో నేను నాశన కారులను తీసుకొని వస్తాను. యూదా యువకుల తల్లులపై వారు దాడి చేస్తారు. యూదా ప్రజలకు బాధను, భయాన్ని కలుగ జేస్తాను. ఇదంతా అతి త్వరలో సంభవించేలా చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 నేను వారి విధవరాండ్ర సంఖ్యను సముద్రపు ఇసుక కంటే ఎక్కువ చేస్తాను. మధ్యాహ్న సమయంలో నేను వారి యువకులు తల్లుల మీదికి నాశనం చేసేవాన్ని రప్పిస్తాను; అకస్మాత్తుగా నేను వారి మీదికి వేదనను, భయాందోళనను రప్పిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 నేను వారి విధవరాండ్ర సంఖ్యను సముద్రపు ఇసుక కంటే ఎక్కువ చేస్తాను. మధ్యాహ్న సమయంలో నేను వారి యువకులు తల్లుల మీదికి నాశనం చేసేవాన్ని రప్పిస్తాను; అకస్మాత్తుగా నేను వారి మీదికి వేదనను, భయాందోళనను రప్పిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 15:8
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు


పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.


ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు కొని – మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు మని చెప్పుదురు.


ఈ స్థలమందు పుట్టు కుమారులనుగూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులనుగూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు


వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యౌవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.


నీమీదికి వచ్చుటకైయొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడ వేతురు.


ముట్టడివేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.


వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.


నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.


మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి.


ఉగ్రతదినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్రచేయుదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లువారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగాచేయుదురు,


కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును.


ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ