Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 14:21 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్టపరచకుమీ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 నీ పేరును బట్టి మిమ్మల్ని గౌరవించేలా మమ్మల్ని తోసివేయవద్దు. మాతో నువ్వు చేసిన నిబంధనను గుర్తు చేసుకో. దాన్ని భంగం చేయవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకైనా మమ్మల్ని త్రోసివేయవద్దు! దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు. మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి. ఆ నిబంధనను మరువవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 మీ పేరు కోసం మమ్మల్ని తృణీకరించకండి; మహిమతో నిండిన మీ సింహాసనాన్ని అగౌరపరచకండి. మాతో మీ ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకోండి దానిని భంగం చేయకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 మీ పేరు కోసం మమ్మల్ని తృణీకరించకండి; మహిమతో నిండిన మీ సింహాసనాన్ని అగౌరపరచకండి. మాతో మీ ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకోండి దానిని భంగం చేయకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 14:21
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.


వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.


ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై


యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.


నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.


నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో–ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.


యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైనవారు మౌనముగా ఉండరు.


నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.


యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితిమి; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమునుబట్టి నీవే కార్యము జరిగించుము.


ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.


ఆ కాలమున–యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనములన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.


దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది


నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి శుద్ధాలయమునందు హతులగుట తగునా?


అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనులమధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.


–ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటిం పుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.


కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా –నా పరిశుద్ధ నామమునుబట్టి రోషముకలిగినవాడనై యాకోబు సంతతివారిని చెరలోనుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరియెడల జాలిపడెదను.


–నర పుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించెదను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరములకు ఉన్నతస్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకయుందురు, నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి


ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితిమి; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయదేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.


నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు.


ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.


వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనములమధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును.


క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.


యెహోవా దానిని చూచెను. తన కుమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.


ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.


యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ