Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 3:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతనిచేతికప్పగించెను, అతడు కూషన్రిషాతాయిమును జయించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి యుద్ధానికి బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించాడు. అతడు కూషన్రిషాతాయిమును జయించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్ధానికి నడిపించాడు. అరాము రాజు కూషన్రిషాతాయిమును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు సహాయం చేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందుకు అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ యుద్ధానికి వెళ్లాడు. యెహోవా ఒత్నీయేలు చేతికి అరాము రాజైన కూషన్-రిషాతాయిమును అప్పగించారు, అతడు అతన్ని ఓడించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందుకు అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ యుద్ధానికి వెళ్లాడు. యెహోవా ఒత్నీయేలు చేతికి అరాము రాజైన కూషన్-రిషాతాయిమును అప్పగించారు, అతడు అతన్ని ఓడించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 3:10
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై–దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.


ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను


అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను


నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.


నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లువారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.


యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరిగాని మరల ప్రవచింపలేదు.


అందుకు మోషే–నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.


బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమతమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను


అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యి యుంచి


ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై


యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.


అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని


మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.


యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.


యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.


అతడు లేహీకి వచ్చువరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను.


అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను.


అందునుగూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగానుండిరి


యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.


వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారిమధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను.


యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సువచ్చును.


సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై


సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ