Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 18:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలోనుండి పరాక్రమవంతులైన అయిదుగురు మనుష్యులను జొర్యానుండియు ఎష్తాయోలునుండియు పంపి –మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 దాను వంశీకులు తమలో ఐదుగురు శూరులను ఎన్నుకుని, ఆ దేశమంతా తిరిగి దాన్ని పరిశోధించడానికి జొర్యా నుండీ ఎష్తాయోలు నుండీ “మీరు వెళ్లి దేశమంతా చూసి రండి” అని చెప్పి పంపారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 అందువల్ల దాను వంశంవారు ఐదుగురు సైనికులను ఏదైనా ఒక ప్రదేశం అన్వేషించమని చెప్పి పంపించారు. వారు ఒక మంచి ప్రదేశం వెదికేందుకు గాను వెళ్లారు. ఆ ఐదుగురు జోర్యా, ఎష్తాయేలు నగరాల నుండి వచ్చారు. దాను వంశమునకు చెందిన అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు. అందువల్లనే వారిని ఎంపిక చేయడం జరిగింది. “వెళ్లి ఏదైనా ఒక చోటు చూడండి” అని వారికి చెప్పబడింది. ఆ ఐదుగురూ కొండ దేశమైన ఎఫ్రాయిముకు వచ్చారు. వారు మీకా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి అక్కడే గడిపారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 18:2
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని–మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా


ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.


మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెను–మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో


మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేలమందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?


మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము యర్మూతు అదుల్లాము శోకో అజేకా


నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి–మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడ దిగగా


దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను.


ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.


మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.


అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.


మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ .ములో నుండెను.


అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.


అక్కడనుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా యింటికి వచ్చిరి.


వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా


వారు జొర్యాలోను ఎష్తాయోలులోనుఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారు–మీ తాత్పర్యమేమిటని యడిగిరి.


ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తరభాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా


అందుకతడు–మేము యూదా బేత్లెహేమునుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్లుచున్నాము. నేను అక్కడివాడను; నేను యూదా బేత్లెహేమునకు పోయియుంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్లుచున్నాను, ఎవడును తన యింట నన్ను చేర్చుకొనలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ