Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




న్యాయాధి 16:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 సమ్సోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి–రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తరువాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఎవరో ఒకతను గాజా పౌరులతో ఇలా చెప్పాడు: “సమ్సోను ఇక్కడికి వచ్చాడు.” సమ్సోనును చంపాలని వారనుకున్నారు. అందువల్ల వారు నగరాన్ని చుట్టు ముట్టారు. వారు నగర ద్వారం వద్ద దాగివున్నారు. ఆ రాత్రి అంతా సమ్సోను కోసం చాలా వేచివున్నారు. నిశ్శబ్దంగా వారు ఒకరితో ఒకరు, “ప్రొద్దు పొడవగానే, మనం సమ్సోనును చంపుదాము” అని చెప్పుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “సంసోను ఇక్కడ ఉన్నాడు!” అని గాజా ప్రజలకు తెలిసినప్పుడు వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, “తెల్లవారినప్పుడు అతన్ని చంపుదాం” అని అనుకుని పట్టణ ద్వారం దగ్గర రాత్రంతా అక్కడినుండి కదలకుండా అతని కోసం కాపలా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “సంసోను ఇక్కడ ఉన్నాడు!” అని గాజా ప్రజలకు తెలిసినప్పుడు వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, “తెల్లవారినప్పుడు అతన్ని చంపుదాం” అని అనుకుని పట్టణ ద్వారం దగ్గర రాత్రంతా అక్కడినుండి కదలకుండా అతని కోసం కాపలా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




న్యాయాధి 16:2
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని


ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి


యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచు నప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.


కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.


వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి


అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టి–నీవు నీ సేవకునిచేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి, సున్నతి పొందనివారి చేతిలోనికి పడవలెనా? అని వేడుకొనగా


సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను.


ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు –ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనేగాని రేపు నీవు చంపబడుదువని చెప్పి


అయితే సౌలు పర్వతము ఈతట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆతట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ