న్యాయాధి 14:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వారు–నీ స్వజనుల కుమార్తెలలోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదనుకొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోను–ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వారు “నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?” అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను “ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు” అని తన తండ్రితో అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 అతని తల్లిదండ్రులు ఇలా సమాధానం చెప్పారు: “నీవు పెళ్లి చేసుకోవటానికి! ఇశ్రాయేలు ప్రజల మధ్య తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. కాని ఫిలిష్తీయుల మధ్యగల ఒక స్త్రీని నీవు పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రజలు సున్నతి కూడా చేసుకోలేదు.” కాని సమ్సోను ఇలా అన్నాడు: “ఆ స్త్రీని నా కోసం తీసుకురండి ఆమె నాకు కావాలి.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, “నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?” అన్నారు. కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, “నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, “నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?” అన్నారు. కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, “నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది.” အခန်းကိုကြည့်ပါ။ |