న్యాయాధి 12:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశమునకు చేరని ముప్పదిమంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అతనికి ముప్ఫైమంది కొడుకులు, ముప్ఫైమంది కూతుళ్ళు ఉన్నారు. అతడు ఆ కూతుళ్ళను తన వంశంలో చేరనివారికిచ్చి, తన వంశంలో చేరని ముప్ఫైమంది కన్యలను తన కొడుకులకు పెళ్లి చేశాడు. అతడు ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 ఇబ్సానుకి ముప్ఫై మంది కొడుకులు, ముప్ఫై మంది కుమార్తెలు ఉన్నారు. తమ బంధువులు కాని వారిని వివాహం చేసుకోవలసిందిగా అతను ముప్ఫై మంది కుమార్తెలను కోరాడు. తమ బంధువులు కాని ముప్ఫై మంది స్త్రీలను అతను కనుగొన్నాడు. వారిని అతని కుమారులు వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్సాను ఏడు సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అతనికి ముప్పైమంది కుమారులు, ముప్పైమంది కుమార్తెలు ఉన్నారు. అతడు తన కుమార్తెలను వేరే గోత్రం వారికి ఇచ్చి పెళ్ళి చేశాడు, అలాగే తన కుమారులకు తన గోత్రానికి చెందని ముప్పైమంది యువతులతో పెళ్ళిళ్ళు చేశాడు. ఇబ్సాను ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అతనికి ముప్పైమంది కుమారులు, ముప్పైమంది కుమార్తెలు ఉన్నారు. అతడు తన కుమార్తెలను వేరే గోత్రం వారికి ఇచ్చి పెళ్ళి చేశాడు, అలాగే తన కుమారులకు తన గోత్రానికి చెందని ముప్పైమంది యువతులతో పెళ్ళిళ్ళు చేశాడు. ఇబ్సాను ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |