యెషయా 60:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు, కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి, ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి. తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి. మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి. నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; నీ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, దూరము నుండి నీ పిల్లలను తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; నీ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, దూరము నుండి నీ పిల్లలను తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు. အခန်းကိုကြည့်ပါ။ |