Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 60:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 నేను కంచుకు బదులు బంగారాన్నీ ఇనుముకు బదులు వెండినీ చెక్కకు బదులు ఇత్తడినీ రాళ్ళకు బదులు ఇనుమునూ తెస్తాను. శాంతిని నీకు అధికారులుగా న్యాయాన్ని నీకు పరిపాలకులుగా నియమిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది. నేను నీకు బంగారం తెస్తాను. ఇప్పుడు నీకు ఇనుము ఉంది, నేను నీకు వెండి తెస్తాను. నీ చెక్కను నేను ఇత్తడిగా మార్చేస్తాను. నీ బండలను ఇనుముగా నేను మార్చేస్తాను. నీ శిక్షను నేను శాంతిగా మార్చేస్తాను. ఇప్పుడు ప్రజలు నిన్ను బాధిస్తున్నారు. కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 నేను ఇత్తడికి బదులు బంగారాన్ని ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. నేను కర్రకు బదులు ఇత్తడిని రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. నేను సమాధానాన్ని నీకు అధిపతిగా నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 నేను ఇత్తడికి బదులు బంగారాన్ని ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. నేను కర్రకు బదులు ఇత్తడిని రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. నేను సమాధానాన్ని నీకు అధిపతిగా నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 60:17
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్ష కుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతివారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవాదూతలవంటి వారుగాను ఉందురు.


యెహోవా తన జనుల గాయముకట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.


మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.


అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.


నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే


యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.


ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.


అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.


– వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.


మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను.


నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును.


ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు చును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ