Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 57:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు. బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 మీరు ప్రతి కొండ మీద, ప్రతి పర్వతంమీద మీ పడక వేసుకొంటారు. మీరు ఆ స్థలాలకు వెళ్లి బలులు అర్పిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు; బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు; బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 57:7
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.


నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీపితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనేవారి ప్రతికారము కొలిచి పోయుదును.


పూర్వకాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని–నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.


చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభిచారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు.


మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను – ద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.


మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలంకరింపబడిన ఉన్నతస్థలములను ఏర్పరచి, వాటిమీద పండుకొని వ్యభిచారము చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగకూడనివి, అట్టివియునిక జరుగవు.


నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలిపీఠములను ఏర్పరచితివి,


ప్రతి అడ్డదోవను నీ బలిపీఠముకట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.


బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్రపరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.


ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.


తమ విగ్రహములమధ్యను తాముకట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటిక్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ