యెషయా 5:5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆలోచించండి, నేను నా ద్రాక్షతోటకు చేయబోయే దాన్ని మీకు వివరిస్తాను. దాన్ని పశువులు మేసేలా దాని కంచెను కొట్టి వేస్తాను. అందరూ దాన్ని తొక్కేలా దాని గోడను పడగొట్టి పాడుచేస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 “నా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు నేను మీతో చెబుతాను. తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను నేను లాగివేసి, దాన్ని కాల్చేస్తాను. దాని రాతి గోడను నేను కూలగొట్టేస్తాను. ఆ రాళ్లు కాళ్ల క్రింద తొక్కబడతాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువునుగూర్చియు కలిగిన యీ దర్శనము నెర వేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునోయనియు మాటలాడుకొనిరి.