Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 48:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకా రము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 మీరంతా ఒక చోటికి వచ్చి నా మాట వినండి. మీలో ఎవరు ఈ విషయాలు తెలియచేశారు? యెహోవా మిత్రుడు బబులోనుకు విరోధంగా తన ఉద్దేశాన్ని నేరవేరుస్తాడు. అతడు యెహోవా ఇష్టాన్ని కల్దీయులకు విరోధంగా జరిగిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 “కనుక మీరంతా సమావేశమై, నా మాట వినండి! ఈ సంగతులు జరుగుతాయని తప్పుడు దేవుళ్లలో ఏదైనా చెప్పిందా? లేదు. యెహోవా ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. బబులోను, కల్దీయులకు యెహోవా ఏమి చేయాలనుకొంటే అది చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “మీరందరూ కలసి వచ్చి వినండి: విగ్రహాలలో ఏది ఈ విషయాలను ముందే చెప్పింది? యెహోవా స్నేహితునిగా ఎంచుకున్నవాడు ఆయన ఉద్దేశాన్ని బబులోనుకు చేస్తాడు ఆయన చేయి బబులోనీయులకు వ్యతిరేకంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “మీరందరూ కలసి వచ్చి వినండి: విగ్రహాలలో ఏది ఈ విషయాలను ముందే చెప్పింది? యెహోవా స్నేహితునిగా ఎంచుకున్నవాడు ఆయన ఉద్దేశాన్ని బబులోనుకు చేస్తాడు ఆయన చేయి బబులోనీయులకు వ్యతిరేకంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 48:14
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. –మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.


యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.


అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.


ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కలు ముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని చెప్పుచు వచ్చెను.


జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.


సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.


కోరెషుతో–నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో–నీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.


ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.


నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును


చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములోనుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదను నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?


యేసు అతని చూచి అతని ప్రేమించి–నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ