Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 46:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 వాటిని మోయడం పశువులకు భారంగా ఉంది, అవి సొమ్మసిల్లి పోతున్నాయి. అవి క్రుంగుతూ, తూలుతూ ఆ విగ్రహాలను కాపాడ లేక పోగా తాము కూడా చెరగా పట్టుబడ్డాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఆ తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడిపోతాయి. ఆ తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి; ఆ బరువును తప్పించుకోలేక అవి కూడా బందీలుగా పట్టుబడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి; ఆ బరువును తప్పించుకోలేక అవి కూడా బందీలుగా పట్టుబడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 46:2
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి.


దక్షిణ దేశములోనున్న క్రూరమృగములనుగూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.


నా పితరులు నిర్మూ లముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులుగాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?


వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లుగాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.


దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు –నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.


కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.


నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికిపోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.


రాబోవు దినములలో నేను బబులోనుయొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును దాని దేశమంతయు అవమానము నొందును జనులు హతులై దానిమధ్యను కూలెదరు


మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపెట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.


నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియులేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.


అందుకతడు–నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, యిక నా యొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదే మన్నమాట అనగా


అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ