యెషయా 42:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-7 గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 “గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 “మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను. నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను. ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం. నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6-7 “యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6-7 “యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. –బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను –బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.
గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.