Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 36:1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 హిజ్కియా రాజు పరిపాలన 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో సరిహద్దు గోడలు ఉన్న పట్టణాలన్నిటిపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 యూదాకు హిజ్కియా రాజు. అష్షూరుకు సన్హెరీబు రాజు. హిజ్కియా రాజైన పదునాలుగవ సంవత్సరంలో సన్హెరీబు యూదా పట్టణాల మీద యుద్ధం చేశాడు. మరియు సన్హెరీబు ఆ పట్టణాలను ఓడించేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 రాజైన హిజ్కియా పాలన పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 రాజైన హిజ్కియా పాలన పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 36:1
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవ త్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా


అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా


అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా


రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత . అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొర బడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.


యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమదినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటివరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.


ఆ దినమున యెహోవా నది (యూఫ్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.


దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మములవరకు యెరూషలేమువరకు అవి వచ్చియున్నవి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ