24 అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, నడికట్టుకు బదులుగా తాడూ, అల్లిన జడకు బదులుగా బోడి తల, ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, అందానికి బదులు వాత ఉంటాయి.
24 ఇప్పుడు ఆ స్త్రీలకు సువాసనల పరిమళాలు ఉన్నాయి కానీ ఆ సమయంలో వారి పరిమళాలు కుళ్లుగాను మురుగుడుగాను అవుతాయి. ఇప్పుడు వాళ్లు వడ్డాణాలు పెట్టుకొంటున్నారు. కానీ ఆ సమయంలో వారు కట్టుకొనేందుకు తాళ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వారి తల వెంట్రుకలు అలంకారంగా అల్లబడుతున్నాయి. కానీ ఆ సమయంలో వారి తలలు గుండ్లు గీయబడతాయి. వారికి శిరోజాలు ఉండవు. ఇప్పుడు వారికి విందు వస్త్రాలు ఉన్నాయి. కాని అప్పుడు విచారం వ్యక్తం చేసే వస్త్రాలే వారికి ఉంటాయి. ఇప్పుడు వారి ముఖాల మీద సౌందర్య చిహ్నాలు ఉన్నాయి. కానీ అప్పుడు వారి ముఖాల మీద వాతలు ఉంటాయి.
24 సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; నడికట్టుకు బదులు తాడు; అల్లిన జడకు బదులు బోడితల; ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.
24 సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; నడికట్టుకు బదులు తాడు; అల్లిన జడకు బదులు బోడితల; ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.
ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళక్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళక్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చి నప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునవారు పరిమళక్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను.
నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.
నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు;
మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైనశ్రమదినముగా ఉండును.
దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు–అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.