Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 27:4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నాకిప్పుడు కోపం ఏమీ లేదు. ఒకవేళ గచ్చ పొదలూ ముళ్ళ చెట్లూ మొలిస్తే యుద్ధంలో చేసినట్టుగా వాటికి విరోధంగా ముందుకు సాగుతాను. వాటన్నిటినీ కలిపి తగలబెట్టేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 నేను కోపంగా లేను. కానీ యుద్ధంలో ఎవరైనా సరే ముళ్ల పొదల కంచె వేస్తే అప్పుడు నేను దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 27:4
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒకడు ముండ్లను చేతపట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు.


ముండ్లను పట్టుకొనువాడు ఇనుపపనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనే కాల్చివేయుదురు.


ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.


నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు


ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మ్రింగివేయును.


ఆ దినమున మీరీలాగందురు –యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి యున్నావు.


జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును.


భక్తిహీనత అగ్నివలె మండుచున్నది అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును.


నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.


నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.


నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.


ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.


అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.


భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్చా పరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ