యెషయా 19:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 యెహోవా వాళ్ళ ఆలోచనలను తారుమారు చేసే ఆత్మను వాళ్ళ మనస్సుల్లో పెట్టాడు. మత్తులో తూలే తాగుబోతు తన వాంతిలో పొర్లినట్టు ఐగుప్తు చేసే పని అంతట్లో వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టించారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 యెహోవా వారి మీద భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 యెహోవా వారి మీద భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతనిచేతులను బలపరచిన షెకెము యజమానులమీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారిమీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమా నులు అబీమెలెకును వంచించిరి.