Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 16:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఎందుకంటే హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్షాతీగెలు వాడిపోయాయి. దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జాతుల అధికారులు అణగదొక్కారు. అవి యాజరు వరకూ వ్యాపించాయి, ఎడారిలోకి పాకాయి. దాని తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్ష వల్లులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని ప్రజలు విచారంగా ఉంటారు. విదేశీ పాలకులు ద్రాక్ష వల్లులను నరికివేశారు. శత్రుసైన్యాలు యాజరు పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్తరించారు. సముద్రం వరకు వారు విస్తరించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 హెష్బోను పొలాలు, షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి. యాజెరు వరకు వ్యాపించిన అరణ్యం వరకు ప్రాకిన శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను దేశాల పాలకులు త్రొక్కివేశారు. వాటి తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 హెష్బోను పొలాలు, షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి. యాజెరు వరకు వ్యాపించిన అరణ్యం వరకు ప్రాకిన శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను దేశాల పాలకులు త్రొక్కివేశారు. వాటి తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 16:8
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను.


అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.


హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.


అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె దను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు.


క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను


సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.


మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.


–అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా


షిబ్మా అను పురములను కట్టి, తాముకట్టిన ఆ పురములకు వేరు పేరులుపెట్టిరి.


వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ