Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 16:12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మోయాబీయులు ఉన్నతస్థలమునకు వచ్చి ఆయాస పడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడువారికేమియు దొరకకపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 మోయాబీయులు ఉన్నత స్థలానికి వచ్చి సొమ్మసిల్లి ప్రార్థన చెయ్యడానికి తమ గుడిలో ప్రవేశించినప్పుడు, వారి ప్రార్థనల వల్ల ప్రయోజనం ఏమీ లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు. ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు. కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అది కేవలం ఆయాసపడుతుంది; ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడు దానికి ఏమి దొరకదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అది కేవలం ఆయాసపడుతుంది; ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడు దానికి ఏమి దొరకదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 16:12
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.


ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనముచేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను.


నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారుగాని హారానువారు గాని, రెజెపులుగాని, తెలశ్శారులోనుండిన ఏదె నీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?


అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలువారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.


అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును.


ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది


పూర్వకాలమున యెహోవా మోయాబునుగూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే; అయితే యెహోవా ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు


యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందునవారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా


అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతుదేశములోనికి తప్పించు కొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.


నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదు రేమో ఆలోచించుము.


అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయనేరవు మేలుచేయుట వాటివలనకాదు.


ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు


ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులో లేకుండజేసెదను ఇదే యెహోవా వాక్కు.


మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.


నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికిపోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.


హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.


అప్పుడు బిలాము బాలాకుతోకూడ వెళ్లెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు


మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నతస్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.


పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.


బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొనిపోయిన తరువాత


ఆయనను చూచుచున్నానుగాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నానుగాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ